కరుణానిధికి తిరుగులేని దెబ్బ, జయలలిత విజయ కేతనం

Jayalalitha
చెన్నై: తమిళనాడులో జయలలిత ఆధ్వర్యంలోని అన్నాడిఎంకె పార్టీ ఘన విజయం సాధించింది. 234 స్థానాలకు గాను అన్నాడిఎంకె కూటమి 96 స్థానాలలో గెలుపొంది 105 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, డిఎంకె కేవలం 19 సీట్లు గెలుచుకొని 14 సీట్లలో ముందంజలో ఉంది. అన్నాడిఎంకె ముఖ్యమంత్రి అభ్యర్థి జయలలిత శ్రీరంగం నుండి ఘన విజయం సాధించింది. జయలలిత ఈ నెల 15న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుంది. డిఎంకె ఓటమి ఖరారు కావడంతో ముఖ్యమంత్రి కరుణానిధి గవర్నర్‌కు లేఖ ద్వారా రాజీనామాను పంపారు. అయితే కొత్త ముఖ్యమంత్రి ఎన్నికయ్యే వరకు ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు. అన్నాడిఎంకె మిత్రపక్షం డిఎండికె అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు విజయ్‌కాంత్ రిషిసంధ్యం నియోజకవర్గం నుండి 21వేల ఆధిక్యంతో గెలుపొందారు.

2జి అవినీతి కుంభకోణంలో ఇరుక్కు పోయిన డిఎంకె పార్టీపై తమిళ ప్రజలు విశ్వాసం కోల్పోయారు. అందుకే అన్నాడిఎంకెకు పట్టం గట్టారు. తమిళనాడు రాజధాని అయిన చెన్నైలో కూడా డిఎంకె పార్టీ పట్టు కోల్పోయింది. రాజధాని నగరంలో కేవలం మూడు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. దక్షిణ చెన్నైలో అయితే పూర్తిగా తుడిచి పెట్టుకు పోయింది. అంబాసముద్రం నుండి సభాపతి అపుడయప్పన్ ఓడిపోయారు. కరుణానిధి 50వేల ఆధిక్యంతో అన్నాడిఎంకె అభ్యర్థిపై తిరువానూర్ నుండి గెలుపొందారు. అయితే డిఎంకె పార్టీలోని పలువురు మంత్రులు ఓటమి బాటలో పయనిస్తున్నారు. డిఎంకె భారీ ఓటమిని జీర్ణించుకోలేని కలైంజ్ఞర్ టీవి ఎన్నికల ఫలితాల ప్రత్యక్ష ప్రసారాలను నిలిపి వేసింది.

తమిళనాడులో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జయలలిత ప్రకటించారు. డబ్బులతో గెలవాలని అనుకున్న డిఎంకె పార్టీకి తమిళ ఓటర్లు గట్టి బుద్ది చెప్పారన్నారు. డిఎంకే ప్రభుత్వంలో నాశనమైన తమిళనాడును తాను పునర్నిర్మిస్తానని చెప్పారు. తమ పార్జీ విజయం డిఎంకె పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనం అన్నారు. కాగా తమిళనాడు విషయంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు తప్పని తేలింది. డిఎంకె, అన్నాడిఎంకె కూటమి మధ్య హోరా హోరీ ఉంటుందని పోల్స్ చెప్పినప్పటికీ అన్నాడిఎంకె క్లీన్ స్వీప్ చేయడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+