కడప లోకసభ స్థానంలో వైయస్ జగన్‌కు 26 వేల ఓట్ల ఆధిక్యత
State
oi-Pratapreddy
By Pratap
కడప: కడప లోకసభ స్థానంలోని అన్ని శాసనసభా నియోజకవర్గాల్లోనూ వైయస్ జగన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. లోకసభ స్థానంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ ఆయన తన హవా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన 26 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పులివెందుల శాసనసభా స్థానంలో వైయస్ విజయమ్మ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కడప లోకసభ స్థానంలో కాంగ్రెసు అభ్యర్థి డిఎల్ రవీంద్రా రెడ్డి రెండో స్థానంలో, తెలుగుదేశం అభ్యర్థి మైసురా రెడ్డి మూడో స్థానంలో కొనసాగుతున్నారు.