పులివెందులలో వైయస్ విజయమ్మ రికార్డు, 85 వేల మెజారిటీ

వైయస్ విజయమ్మకు లక్షా 14 వేల 198 ఓట్లు పోలయ్యాయి. వైయస్ వివేకానంద రెడ్డి రెండో స్థానంలో నిలిచి కాస్తా పరువు దక్కించుకున్నారు. ఆయనకు 28 వేల 626 ఓట్లు వచ్చాయి. కాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బిటెక్ రవి మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆయనకు 11 వేల 552 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇద్దరికి పోలైన ఓట్లను కలిపినా విజయమ్మ మెజారిటీతో సమానం కావడం లేదు. విజయమ్మ విజయంతో సానుభూతి విజయం సాధించిందని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications