పేలిన బ్రిటిష్ విమానం టైర్: చిరంజీవి, నాగార్జునలకు తప్పిన ముప్పు

Nagarjuna-Chiranjeevi
హైదరాబాద్: ప్రముఖ సినీ నటులు చిరంజీవికి, నాగార్జునకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. మంగళవారం ఉదయం హైదరాబాదులోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్ వెళ్ల వలసిన హైదరాబాద్ - బ్రిటిష్ విమానానికి ఘోర ప్రమాదం తప్పింది. ఉదయం గం.7.10 నిమిషాలకు హైదరాబాదు నుండి బయలు దేరవలసి ఉంది. అయితే విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో వెనుక టైరులో పగుళ్లు ఏర్పడినాయి. అయితే ఈ ప్రమాద విషయాన్ని పైలట్ వెంటనే గుర్తించాడు. దీంతో ప్రమాదం తప్పింది.

ఎమర్జెన్సీ టైర్ సహాయంతో విమానాన్ని కిందకు దింపారు. పైలట్ చాకచక్యం కారణంగా ఘోర ప్రమాదం తప్పింది. ఈ విమానంలో చిరంజీవి, నాగార్జునతో పాటు పలువురు ఇతర ప్రముఖులు ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా విమానంలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని పరీశీలిస్తామని అధికారులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+