ప్రణబ్‌కు కాదు చిదంబరంకు: చంద్రబాబును ఇరుకున పెడుతున్న నాగం

ఇన్నాళ్లు టిడిపి తాము తెలంగాణ కోసం ప్రణబ్ కమిటీకి లేఖ రాశామని చెప్పుకొచ్చేది. అయితే నాగం కాలం చెల్లిన ప్రణబ్‌కు కాకుండా చిదంబరానికి రాయాలని చెప్పడంతో చంద్రబాబును మరింత ఇరుకున పెట్టారు. దీంతో ఇప్పటికే నాగంకు, టిడిపికి ఉన్న గ్యాప్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. చిదంబరానికే ఖచ్చితంగా లేఖ రాయాలని చంద్రబాబుకు నాగం సూచించడంతో అధినేత ఆయనపై మరింత అగ్రహం వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తోంది. నాగం వ్యాఖ్యలు కేవలం టిడిపిలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కాకా పుట్టిస్తున్నాయి. నాగం వ్యాఖ్యల కారణంగా సీమాంధ్ర టిడిపి నేతలు సమైక్యాంధ్ర నినాదాన్ని గట్టిగా తెరపైకి తెచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications