హైకమాండ్ దిమ్మ తిరిగింది, చిరుకు పౌరుషం చూపారు: కొండా సురేఖ

కాంగ్రెసు పార్టీ కనుమరగవుతుందని తాను ఏనాడో చెప్పానని ఆమె గుర్తు చేశారు. జగన్ గెలుపు పాలపొంగులాంటిదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యపై ఆమె విరుచుకుపడ్డారు. జగన్ పట్ల వ్యక్తమవుతున్న అభిమానం గిన్నెలోని పాల వంటిది కాదని, సప్తసముద్రాల్లో నీరు వంటిదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ల పాలనలో రైతులను విస్మరించారని, రైతులు తిన్నది అరగక, డబ్బుల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నాడని ఆమె అన్నారు. చంద్రబాబు సభలకు ప్రజలే రాలేదని సురేఖ అన్నారు. జగన్ పట్ల ప్రజా విశ్వాసం పెరుగుతోందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications