సభా వేదిక వద్ద షార్ట్ సర్య్కూట్: సోనియాగాంధీకి తప్పిన ముప్పు
National
oi-Srinivas G
By Srinivas
లక్నో: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి బుధవారం తీవ్ర ముప్పు తప్పింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాశిలో బుధవారం సాయంత్రం కాంగ్రెసు పార్టీ సభలో సోనియాగాంధీ పాల్గొననున్నారు. అయితే ఆమె ఇంకా అక్కడకు రాలేదు. ఆ లోపు సభ కోసం ఏర్పాటు చేసిన వేదికపై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. తేరుకున్న కాంగ్రెసు నేతలు షార్ట్ సర్య్కూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు గమనించారు.
అయితే అప్పటికి సోనియా గాంధీ ఇంకా రాలేదు. దాంతో కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పాల్గొననున్నారు.