కిరణ్ కుమార్ రెడ్డికి వైయస్ జగన్ భయం: ఇద్దరు మంత్రులపై ఫిర్యాదు

గత నెల 16వ తేదీన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ ఇద్దరు మంత్రులు వైయస్ జగన్‌కు సమాచారం అందిస్తారనే ఉద్దేశంతోనే తాను మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నానని ఆయన ఆజాద్‌తో చెప్పినట్లు సమాచారం. ఆ ఇద్దరు మంత్రులు కూడా కోస్తాంధ్రకు చెందినవారని, శాఖలు కేటాయించగానే తిరుగుబాటు బావుటా ఎగురవేసినవారని తెలుస్తోంది. తాను ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి చెప్పి, మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు అనుమతి ఇవ్వాలని కోరుతానని ఆజాద్ ముఖ్యమంత్రికి చెప్పినట్లు తెలుస్తోంది.
దానికి తోడు, నలుగురు మంత్రులకు చెందిన కుటుంబ సభ్యులు జగన్ వెంట నడుస్తున్నారని, వారిని కూడా తొలగించడానికి అనుమతి ఇవ్వాలని కిరణ్ కుమార్ రెడ్డి ఆజాద్‌తో చెప్పినట్లు సమాచారం. తన వ్యవహార శైలిపై పలువురు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆ విషయాలపై ఆజాద్‌కు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications