నష్టనివారణ చర్యలకు దిగిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

ముఖ్యమంత్రి ఈ నెల 23వ తేదీన శాసనసభ్యులు, ఎమ్మెల్సీలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆ తర్వాత పార్లమెంటు సభ్యులను, నాయకులను కలుసుకుంటారని తెలుస్తోంది. ఈ సమావేశాలకు ఎజెండా ఏమీ ఉండదని, మీలో నేను ఒక్కడిని అనే విషయాన్ని వారికి చేరవేయడమే ముఖ్యమంత్రి ఉద్దేశమని చెబుతున్నారు. శాసనసభ్యులు, ఎమ్మెల్సీలతో సమావేశం తర్వాత మంత్రివర్గంలోకి కొత్తవారిని తీసుకుంటారని, శాఖలను మారుస్తారని, తద్వారా మంత్రుల్లో శాఖల కేటాయింపుపై ఉన్న అసంతృప్తిని తొలగిస్తారని చెబుతున్నారు. రెండు రోజుల హైదరాబాదు పర్యటనలో ముఖ్యమంత్రిని సమర్థించినవారు ఆజాద్‌కు కనిపించలేదని చెబుతున్నారు. పెట్టారు.












Click it and Unblock the Notifications