ఎంపీలు రాజీనామాకు సిద్ధం: కెకె, కాంగ్రెసు ఎంపీలకు చేదు అనుభవం

ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని కేంద్రం చెప్పిందని అన్నట్టుగానే ఎన్నికలు అయిపోయాయని ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెసు ఎంపీలు మంద జగన్నాధం తదితరులు అన్నారు. జూన్‌లో ఖచ్చితమైన ప్రకటన చేయాలని కోరారు. లేదంటే ఉద్యమం తీవ్రతరం కాక తప్పదని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉందని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. హైదరాబాదులో అయినా ఢిల్లీలో అయినా తమది ఒక్కటే మాట అన్నారు. కాంగ్రెసు కూడా రాష్ట్ర విభజనకు చొరవ తీసుకుంటే తెలంగాణ ఖచ్చితంగా వస్తుందని చెప్పారు.
పార్లమెంటులో వెంటనే బిల్లు పెట్టాలని ప్రజా గాయకుడు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ చైర్మన్ గద్దర్ డిమాండ్ చేశారు. తమకు వనరులు లేని తెలంగాణ అవసరం లేదన్నారు. ఆంధ్ర ప్రాంత బడా నేతలు ఇప్పటికే తెలంగాణను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో స్వామి అగ్నివేష్, పలువురు కాంగ్రెసు ఎంపీలు, టిఆర్ఎస్ నుండి ఈటెల రాజేందర్, హరీష్ రావు, కెటిఆర్ తదితరులు పాల్గొన్నారు. అరుంధతీరాయ్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరాం, గద్దర్ జర్నలిస్టుల ఫోరానికి సంఘీభావం ప్రకటించారు. కాగా అంతకుముందు కాంగ్రెసు ఎంపీలకు చేదు అనుభవం ఎదురయింది. తెలంగాణ ఎంపీలు రాజీనామా చేసిన తర్వాతే వేదికపైకి రావాలని జర్నలిస్టులు నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications