నారా లోకేష్‌ నాయకత్వంపై చిత్తూరు నేతల రహస్య అభిప్రాయ సేకరణ

Nara Lokesh
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్ నాయకత్వ వ్యవహారం చిత్తూరు జిల్లా పార్టీలో దుమ్ము రేపుతోంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం ఇంచార్జీ బాధ్యతలు అప్పగించాలని కార్యకర్తలు కోరుతున్నారు. లోకేష్‌కు బాధ్యతలు అప్పగించాలనే విషయంపై చంద్రగిరి నియోజకవర్గం నాయకులు పట్టుదలతో ఉన్నారు. దీంతో జిల్లా నాయకత్వం చంద్రగిరి నియోజక వర్గం నాయకుల నుంచి రహస్యంగా అభిప్రాయాలు సేకరిస్తోంది.

నారా లోకేష్ వ్యవహారంపై జిల్లా పార్టీ సమావేశంలో గందరగోళం సృష్టించవద్దని పార్టీ జిల్లా అధ్యక్షుడు మహదేవ నాయుడు చంద్రగిరి నియోజకవర్గం నాయకులను హెచ్చరించారు. నారా లోకేష్ వ్యవహారం రాష్ట్ర పార్టీలో వారసత్వ పోరు వివాదాన్ని ముందుకు తెస్తుండడంతో చిత్తూరు జిల్లా నాయకత్వం ఇరకాటంలో పడింది. అయితే, కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తుందనే సాకుతో నారా లోకేష్ నాయకత్వాన్ని ముందుకు తేవడానికి అవకాశాలున్నాయని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+