ఎమ్మెల్యేగా చిరంజీవి రాజీనామా, తిరుపతి సీటుకు ఉప ఎన్నిక?

కాగా, కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీ విలీన ప్రక్రియ వేగవంతమైంది. దీనిపై చర్చించడానికి ప్రజారాజ్యం పార్టీ నాయకులు గంటా శ్రీనివాస రావు, సి. రామచంద్రయ్య ఢిల్లీ వెళ్లారు. వారు ఎన్నికల కమిషన్‌తో చర్చిస్తారు. అలాగే, కాంగ్రెసు పార్టీ అధిష్టానంతో చర్చిస్తారు. విలీనం ప్రక్రియకు పచ్చజెండా ఊపాలని వారు ఇసిని కోరే అవకాశం ఉంది. జూన్ మొదటి వారానికి విలీన ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.
ఇదిలావుంటే, ఢిల్లీలో కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ పార్టీ అధ్యక్షురాలు సోనియాతో భేటీ అయ్యారు. ప్రజారాజ్యం పార్టీ విలీన ప్రక్రియపైనే ఆజాద్ సోనియాతో మాట్లాడినట్లు తెలుస్తోంది. అలాగే, పిసిసి అధ్యక్ష పదవి, స్పీకర్, డిప్యూటీ సిఎం పదవుల భర్తీపై కూడా ఆయన సోనియాతో మాట్లాడినట్లు చెబుతున్నారు. కాగా, చిరంజీవి రాజీనామా చేస్తే తిరుపతి నుంచి పోటీ చేయడానికి మాజీ శాసనసభ్యుడు వెంకటరమణ సిద్దపడుతున్నారు.












Click it and Unblock the Notifications