ఫేస్‌బుక్ ఎకౌంట్ డేటాపై కంట్రోల్‌ని తెచ్చుకోవాలనుకునే వారికి ట్రిక్స్

ఈ వర్క్‌షాప్‌లో దేశవిదేశాల నుండి ఎంతో మంది పెద్దలు పాల్గోనడం జరిగింది. ఈ వర్క్‌షాప్‌లో ముఖ్యంగా మేము చర్చించినది ఏమిటంటే ఫేస్‌బుక్ వెబ్‌సైట్ మీద. అసలు వర్క్ షాప్ ఎలా మొదలైంది అంటే ఫేస్‌బుక్‌ని అసలు మనం పర్సనల్ వెబ్‌సైట్‌గా ఎందుకు మార్చుకోకూడదు అంటూ... ప్రస్తుతం ఫేస్‌బుక్లో 600 మంది మిలియన్ యాక్టివ్ యూజర్స్ ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఇది మాత్రమే కాకుండా హాకర్స్ ద్వారా కూజా మన డేటా హాకింగ్ చేసే అవకాశం ఉంది. దీంతో మన డేటా మొత్తాన్ని అవతలి వారు యాక్సెస్ చేసే అవకాశం ఉంది. సాధారణంగా చాలా వరకు ఇలాంటి వాటిని అరికట్టే దాని కోసమే ఫేస్‌బుక్ కొత్తగా కంట్రోల్స్‌ని చేర్చింది.
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ ఏవి అయినా కొత్త కొత్త ఫీచర్స్‌ని ఎప్పటికప్పుడు అనుసంధానం చేస్తూ ఉంటాయి. దీంతో చాలా మందికి కొత్త ఫీచర్స్‌ని ఎలా వాడాలో తెలియకపోవచ్చు. దీనివల్ల పర్సనల్ డేటాని జాగ్రత్త చేసుకోవడంలో చాలా మంది నిర్లక్ష్యం చేయడం వల్ల డేటా అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. దీనిని నుండి మిమ్మల్ని కాపాడుకోవడం కోసం ఫేస్‌బుక్ ఎకౌంట్ సెట్టింగ్స్‌లో ఉన్నటువంటి అన్ని ఫీచర్స్‌ని సమర్దవంతంగా ఉపయోగించుకోవడమే. దీని వల్ల ఫేస్‌బుక్లో మన ఐడెంటిటీని కాపాడుకోగలుగుతాం.. దీని కోసం మనం ఏమి చేయాలి.. ఏమీ లేదు ఈ క్రింది ట్రిక్స్‌ని పాటిస్తే చాలు....
* మల్టిబుల్ సెషన్స్ నుండి లాగ్ అవుట్ అవ్వడం
సాధారణంగా మనం ఇంటర్నెట్ కేఫ్‌ల నుండి ఫ్రెండ్స్ మొబైల్స్ నుండి మన ఫేస్‌బుక్ ఎకౌంట్ లోకి లాగిన్ అవ్వడం చేస్తుంటాం.. అలాంటి సమయల్లో చాలా సార్లు మనం లాగ్ అవుట్ చేయడం కూడా మనం మరచిపోతుంటాం. అలాంటి సమయాల్లో ఫేస్‌బుక్ సెషన్ అనేది ఓపెన్ చేసి ఉంటుంది. దాంతో ఫేస్‌బుక్ ఎకౌంట్ మిస్ యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇలాంటివి అన్నింటి జరగకుండా ఉండాలంటే మీరు ఎప్పుడైనా వేరే వాళ్శ సిస్టమ్స్ నుండి లాగిన్ అయ్యినప్పుడు వెంటనే పాస్‌వర్డ్ మార్చుకుంటే సరిపోతుంది.
*కంట్రోల్ ఆప్షన్‌ని తీసుకోండి
మీ ఫేస్‌బుక్ ఎకౌంట్‌లోకి వెళ్శి Account > Account Settings > Account Security > Account Activity > Also Active ఇలా అన్నింటిని యాక్టివ్ చేయండి. మీకు వీటిల్లో ఏవి ఐతే అనవసరం అనుకుంటారో వాటిని మాత్రం ఎండ్ యాక్టివిటి టిక్ మార్క్‌తో క్లిక్ చేయండి. దీని వల్ల మీరు కోడ్ అలర్ట్ మేసేజ్‌లు పోందడం జరగుతుంది అది ఎప్పుడంటే మొబైల్ ద్వారా ఫేస్‌బుక్ కనెక్ట్ అయ్యినప్పుడు.
*ఫేస్‌బుక్‌లో ఉన్న పనికి రాని ఫోటో టాగ్స్‌ని తోలగించండి
సాధారణంగా ఫేస్‌బుక్‌లో కొంత మంది అవసరంగా పనికి రాని ఫోటోలను పెడుతూ ఉంటారు. దానిపై కొంత మంది స్నేహితులు పిచ్చి పిచ్చి కామెంట్స్ రాస్తూ ఉంటారు. దీని ద్వారా కూడా మీరు ఇబ్బందులలో పడే అవకాశం ఉంటుంది. సో అలాంటి పనికి రానటువంటి ఫోటోలను మాత్రం ఫేస్‌బుక్‌లో ఉంచమాకండి. దీనికోసం మీరు మీ ఎకౌంట్‌లోకి వెళ్శి Account > Privacy Settings > Sharing on Facebook లోకి వెళ్శి Customize settings లోకి వెళ్శి వాల్ మీద రాసినటువంటి కామెంట్స్‌ని చూడండి.
*ఎకౌంట్‌ని సెక్యూర్ చేసుకోండి
ఫేస్‌బుక్‌లో హాకింగ్ అనేది పెద్ద సమస్యగా మారింది. ఐతే ఫేస్‌బుక్‌లో మాత్రం మీ డేటాని సెక్యూర్‌గా యాక్సెస్ చేసుకునే వెసులుబాటు కల్సిస్తుంది. దీని కోసం మీరు చేయాల్సిందల్లా Account > Account Settings> Account Security > Secure Browsingని సెలెక్ట్ చేసుకోవడమే. దీనివల్ల మీరు సెక్యూర్ బ్రౌజింగ్‌ని మీ ఫేస్‌బుక్‌లో పోందగలుగుతారు.
*ఆన్ లైన్ నుండి ఫేస్‌బుక్‌ని వేటాడడం ఆపండి
సాధారణంగా మీరు ఏదైనా న్యూస్ వెబ్ సైట్‌ని చదువుతున్నప్పుడు ఈ వార్తని మీ స్నేహితులకు ఫేస్‌బుక్ ఎకౌంట్ ద్వారా పంపండి అంటూ చాలా చూస్తుంటాం. ఇదిమాత్రమే కాదు ఏదైనా ట్రావెల్ వెబ్ సైట్‌ని చూస్తున్నప్పుడు కూడా ఈ పోటో గ్రాప్స్‌ని మీ స్నేహితులకు రికమెండ్ చేయండి అంటూ పాప్ అప్స్ చాలా వస్తుంటాయి. ఇలాంటి వాటికి మీరు స్వస్తి చెబితే చాలు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీ ఎకౌంట్ లోకి వెళ్శి Account > Privacy Settings > Apps and Websites> Instant Personalization. ఇందులో మీరు Instant Personalizationని డీసెలక్ట్ చేసుకోవాలి.
*యాడ్స్‌ని తగ్గించండి
ఏదైనా ప్రెండ్ సమాచారాన్ని లైక్ చేసినప్పుడు మీ ప్రోపైల్‌లో ఆ సమాచారం పాప్ మాదిరి వస్తుంది. అంతేకాకుండా స్పాన్సర్డ్ పేజీలలో ఒక్కసారి అయినా అది కనిపిస్తుంది. ఇది మాత్రమే కాకుండా యాడ్స్, పాప్ అప్స్ తోటి మీయొక్క ప్రొపైల్‌ని హురెత్తిస్తుంటారు. ఇలాంటి యాడ్స్ అన్నింటిని మీరు పర్మినెంట్‌గా బ్లాగ్ చేసుకోవచ్చు. దానికోసం మీరు చేయాల్సిందల్లా యాడ్ బ్లాకింగ్ యాడ్ ఆన్‌ని మీ బ్రౌజర్‌లో ఇనిస్టాల్ చేసుకోవడమే. అందుకోసం మీరు మీ బ్రౌజర్‌లోని Tools > Add-ons > GreaseMonkey. Click install నొక్కడమే.