సింగపూర్‌కు రజనీకాంత్: విశ్రాంతి కోసమేనా, ప్రత్యేక చికిత్స కోసమా?
National
oi-Pratapreddy
By Pratap
|
చెన్నై: అస్వస్థతతో చెన్నై శ్రీరామచంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సింగపూర్ వెళ్లనున్నారు. ఆయన శుక్రవారం రాత్రి ప్రత్యేక విమానంలో సింగపూర్ బయలుదేరి వెళ్తారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు కూడా వెళ్తున్నారు. విశ్రాంతి కోసమే రజనీకాంత్ సింగపూర్ వెళ్తున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రజనీకాంత్ పూర్తిగా కోలుకున్నారని, అయితే విశ్రాంతి అవసరమని వైద్యులు అంటున్నారు.
కాగా, రజనీకాంత్ ప్రత్యేకంగా చికిత్స చేయించుకోవడానికి మాత్రమే సింగపూర్ వెళ్తున్నట్లు వదంతులు గుప్పుమంటున్నాయి. వెన్నెముకకు సంబంధించిన శస్త్రచికిత్స కోసం ఆయన సింగపూర్ బయలుదేరుతున్నట్లు చెబుతున్నారు. రజనీకాంత్‌కు ఏ విధమైన చికిత్స అవసరం లేదని, కేవలం విశ్రాంతి కోసమే సింగపూర్ వెళ్తున్నారని కుటుంబ సభ్యులు గట్టిగానే చెబుతున్నారు.