వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చంద్రబాబుపై ఒత్తిడి చేయండి: టిడిపి ఎమ్మెల్యేలకు నాగం ఎస్సెమ్మెస్‌లు

తెలంగాణపై చంద్రబాబు స్పష్టమైన వైఖరి తీసుకుంటేనే తెలంగాణ ప్రాంతంలో టిడిపి ఉంటుందని గత కొద్ది రోజులుగా నాగం జనార్దన్ రెడ్డి పార్టీని, అధినేతను డిమాండ్ చేసి సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. పార్టీ నుండి సస్పెన్షన్‌కు గురైన తర్వాత కూడా నాగం టిడిపిని టార్గెట్ చేయడం మానలేదు. తెలంగాణపై తీర్మానం చేసేలా అధినేతపై ఒత్తిడి చేయాలని టిడిపి ఎమ్మెల్యేలకు మెసేజ్‌లు పంపడం ద్వారా ఆయన బాబుపై తీవ్ర ఒత్తిడి పెంచడం విశేషం. తాను సస్పెండ్ అయినా తెలంగాణపై పట్టు వీడేది లేదని చెప్పడానికే నాగం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడనే వాదనలు వినిపిస్తున్నాయి.