వారానికి 3 రోజులు పులివెందులలో: వివేకాకు విజయమ్మ కౌంటర్!

YS Vijayamma
పులివెందుల: వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ మాజీ మంత్రి, మరిది వైయస్ వివేకానందరెడ్డికి కౌంటర్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. సోమవారం బెంగుళూరు నుండి తన నియోజకవర్గం అయిన పులివెందుల చేరుకున్న వైయస్ విజయమ్మ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలను స్వీకరించింది. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇక నుండి వారానికి మూడు రోజులు నియోజకవర్గంలోనే ఉండి ప్రజా సమస్యలపై ప్రత్యేక శ్రద్ద పెడతానని హామీ ఇచ్చారు.

ప్రజల సమస్యలను పరిష్కరించడమే తన లక్ష్యమని ఆమె చెప్పారు. నియోజకవర్గంలో అభివృద్ధికి సమయాన్ని కేటాయిస్తానని ఆమె చెప్పారు. అయితే గత ఉప ఎన్నికలకు ముందు విజయమ్మపై పోటీ చేసిన మరిది వైయస్ వివేకానందరెడ్డి విజయమ్మ నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉండదని ప్రజలకు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆమె వివేకానందరెడ్డి మాటలను వమ్ము చేస్తూ వారానికి మూడు రోజులు నియోజకవర్గంలో ఉంటానని హామీ ఇచ్చింది. అంతేకాదు ఓ గ్రూప్ వన్ స్థాయి వ్యక్తిని వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకొని ప్రజా సమస్యలపై దృష్టి సారించే ప్రయత్నాలు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+