వైయస్ జగన్ ఎమ్మెల్యేలపై అయోమయం ఉంది: పిసిసి చీఫ్ డి శ్రీనివాస్

వచ్చే స్థానిక సంస్థలలో గెలుపే తమ లక్ష్యం అన్నారు. ఆ ఎన్నికలపై దృష్టి సారిస్తామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బిసిలకు మూడోవంతి రిజర్వేషన్లకు కాంగ్రెసు కట్టుబడి ఉందన్నారు. అవసరమైతే కేంద్రంపై రాజ్యాంగ సవరణ కోసం కూడా ఒత్తిడి తీసుకు వస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలలో స్థానిక నాయకత్వ నిర్ణయాలను ప్రధానంగా తీసుకుంటామని చెప్పారు. అవిశ్వాసం అనేది ప్రతిపక్షాల హక్కు అన్నారు. ఎవరూ అవిశ్వాసం పెట్టిన ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.












Click it and Unblock the Notifications