వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొండికేసిన ఎన్‌డి తివారీ, రక్త నమూనాలకు నిరాకరణ

By Pratap
|
Google Oneindia TeluguNews

ND Tiwari
న్యూఢిల్లీ: పితృత్వం కేసులో రక్త నమూనాలను ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్‌డి తివారీ నిరాకరించారు. రక్త నమూనాలను ఇవ్వడానికి ఆయన బుధవారం ఢిల్లీ హైకోర్టుకు రావాల్సి ఉంది. డిఎన్ఎ పరీక్ష కోసం రక్తం ఇవ్వాలని తనను బలవంతం పెట్టకూడదని ఆయన ఓ దరఖాస్తు పెట్టుకున్నారు. తనను తివారీ కుమారుడిగా ప్రకటించాలని కోరుతూ రోహిత్ శేఖర్ అనే యువకుడు 31 ఏళ్ల యువకుడు కోర్టులో కేసు వేశాడు.

పితృత్వం కేసులో రక్త నమూనాలు ఇవ్వడానికి కోర్టుకు రావాలని హైకోర్టు జాయింట్ రిజిస్ట్రార్ దీపక్ గార్గ్ గతవారం తివారీని ఆదేశించారు. రక్త నమూనాలు ఇవ్వడానికి కోర్టుకు రావాలని కోర్టు రోహిత్ శేఖర్‌ను, అతని తల్లి ఉజ్వల శర్మను కూడా ఆదేశించింది. డిఎన్ఎ పరీక్షలు హైదరాబాదులోని డిఎన్ఎ, ఫింగర్ ప్రింటింగ్, డయాగ్నస్టిక్ సెంటర్‌లో జరగాల్సి ఉంది.

English summary
Veteran Congress leader ND Tiwari Wednesday refused to appear before the Delhi High Court and moved an application that he cannot be forced to give blood sample for DNA test in a paternity suit filed by a 31-year-old man who says Tiwari is his biological son.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X