ముంబై దాడుల ప్రధాన అనుమానితుడు ఇలియాస్ కాశ్మీరీ హతం

ద్రోన్ ద్వారా రెండేసి క్షిపిణులను కొద్దిపాటి విరామంతో ప్రయోగించినట్లు బిబిసి ఉర్దూ చానెల్ తెలిపింది. ద్రోన్ దాడుల్లో కాశ్మీరీతో పాటు తొమ్మిది మంది ఉగ్రవాదులు మరణించినట్లు స్థానికులు తెలిపారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ద్రోన్ దాడులు జరిగిన విషయాన్ని పెషావర్ అధికార వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. అయితే, మృతుల్లో కాశ్మీరీ ఉన్నట్లు స్పష్టం చేయడం లేదు. మృతులు పంజాబీ తాలిబన్ ఉగ్రవాదులని చెబుతున్నారు.
కాశ్మీరీ పది రోజుల క్రితం ఖైబర్ గిరిజన ప్రాంతం నుంచి వానా వచ్చినట్లు తెలుపుతున్నారు. కాశ్మీరీ మృతిపై ముల్తాన్‌లో పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీని అడగ్గా తనకు సమాచారం లేదని సమాధానమిచ్చారు.












Click it and Unblock the Notifications