డిసిఎం కోసం గీతా రెడ్డి ప్రయత్నాలు, మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో జాప్యం

Geetha Reddy
హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి పదవి కోసం మంత్రి జె. గీతా రెడ్డి తన ప్రయత్నాలను మానుకోలేదు. ఆ పదవి కోసం ఆమె తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. దానికోసం ఆమె ఇటీవల ఢిల్లీ వెళ్లి, అధిష్టానం పెద్దలను కలిశారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌ను కూడా కలిశారు. అయితే, ఈ పదవి మెదక్ జిల్లాకే చెందిన దామోదరం రాజనర్సింహకు దాదాపుగా ఖరారైనట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితులు కావడం, ఎస్సీల్లో మాదిగ వర్గానికి చెందినవారు కావడం దామోదరం రాజనరసింహకు కలిసి వచ్చే అంశాలని చెబుతున్నారు.

కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి పునర్వ్యస్థీకరణ మూడు వారాల తర్వాతే జరుగుతుందని అంటున్నారు. గులాం నబీ ఆజాద్ విదేశీ పర్యటనకు వెళ్లడంతో ఈ జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. ఆయన ఈ నెల 16 లేదా 17వ తేదీన తిరిగి దేశానికి వచ్చే అవకాశాలున్నాయి. ఆయన వచ్చిన తర్వాతనే మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ జరుగుతుందని చెబుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవిని భర్తీ చేయడంతో పాటు ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులను మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి ఉంది. కాంగ్రెసు ప్రజారాజ్యం పార్టీ విలీన ప్రక్రియ పూర్తయిన తర్వాతనే మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ ఉంటుందని భావిస్తున్నారు. అంతే కాకుండా మంత్రి బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. దీంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటికే మంత్రి జూపల్లి కృష్ణా రావు మంత్రి పదవికి రాజీనామా చేశారు. బొత్స కూడా రాజీనామా చేస్తే రెండు మంత్రి పదవులు ఖాళీ అవుతాయి. వీటిని భర్తీ చేయడంతో పాటు కొత్తగా మరి కొంత మందిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని అంటున్నారు. కొంత మంది మంత్రుల శాఖలను కూడా మారుస్తారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+