వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోర్ కమిటీలో చర్చిస్తాం: తెలంగాణపై నేతలకు మన్మోహన్ సింగ్ హామీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
హైదరాబాద్: 'తెలంగాణ విషయంలో మీరు ఎదుర్కొంటున్న ఇబ్బంది చాలా తీవ్రమైంది. మీ చిత్తశుద్ధిని నేను అర్థం చేసుకున్నాను. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ దృష్టికి తప్పకుండా తీసుకెళ్తా' అని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హామీ ఇచ్చారు. గురువారమిక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులతో కూడిన 25మంది సభ్యుల బృందంతో భేటీ అయిన సందర్భంగా ఆయన ఈ హామీ ఇచ్చారు. సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిందిగా కోర్‌ కమిటీకి సూచిస్తానని ప్రధాని పేర్కొన్నారు. సుమారు 40 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో తాము చెప్పినదంతా ప్రధాని ఓపికగా విన్నారని భేటీ అనంతరం ఎంపీ కేశవరావు విలేకరులకు తెలిపారు. ప్రధాని స్పందన పట్ల తాము సంతోషంగా ఉన్నామని వెల్లడించారు.

ఈ నెల 15వ తేదీన ప్రణబ్‌ ముఖర్జీతో భేటీ సమయానికి తెలంగాణపై కోర్‌ కమిటీలో చర్చించాల్సిందిగా కాంగ్రెస్‌ నేతలు ప్రధానికి విజ్ఞప్తి చేశారు. దీనికి ప్రధాని అంగీకరించారని కేశవరావు తెలిపారు. ఎంపీలు వి.హనుమంతరావు, కేశవరావులు తెలంగాణ సమస్య మూలాలను, డిసెంబరు 9 తర్వాతి పరిణామాలను, ప్రస్తుత క్షేత్ర స్థాయి పరిస్థితులను చాలాసేపు వివరించారు. ఐదు రాష్ట్రాల ఎన్నిలయ్యేంత వరకూ ఢిల్లీ రావొద్దని సీనియరు నేతలు సూచించినందున వేచి ఉన్నామని, ఎన్నికలు పూర్త్తెనందున ఇప్పుడు అందరినీ కలవాలనుకుంటున్నామని కేశవరావు ప్రధానికి తెలిపారు. తాము ప్రస్తుతం తమ నియోజకవర్గాల్లోని గ్రామాల్లో తిరగలేకపోతున్నామని, కనీసం పెళ్లిళ్లకూ హాజరయ్యే పరిస్థితి లేదని తెలిపారు. ఉద్యమం అంత తీవ్రంగా ఉన్నా తాము కాంగ్రెస్‌ పార్టీకి విధేయులుగానే ఉన్నామని, కానీ ఇద్దరు ఎంపీలు అధిష్ఠానాన్ని ధిక్కరించి జగన్‌ పార్టీతో జతకట్టారని, సోనియాను సవాలు చేస్తున్నారని, ఇప్పటిదాకా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని వీహెచ్‌ ప్రధానికి గుర్తు చేశారు.

జూపల్లి కృష్ణారావును పరిచయం చేస్తూ ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందీ తెలిపారు. ఆంధ్రా, రాయలసీమల్లోని సాధారణ ప్రజలు సమైక్యాంధ్ర కోసం ఆందోళన చేయడంలేదని, కొందరు నేతలు స్వప్రయోజనాల కోసం తెలంగాణను వ్యతిరేకిస్తున్నారని కొందరు నేతలు ప్రధానికి చెప్పారు. సీమాంధ్రకు చెందిన భాజపా నేత వెంకయ్య నాయుడు, సీపీఐ నేత నారాయణ బహిరంగంగా తెలంగాణకు మద్దతు పలుకుతున్నారని గుర్తు చేశారు. వారిపై ఆ ప్రాంతంలో వ్యతిరేకత ఏమీ లేదని తెలిపారు. ప్రధానిని కలిసిన వారిలో ఎంపీలు సర్వే సత్యనారాయణ, గుత్తా సుఖేందర్‌రెడ్డి, మధు యాస్కీ, వివేక్‌, రాజయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బలరాం నాయక్‌, మంత్రులు గీతారెడ్డి, సారయ్య, ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, నేతలు జి.వినోద్‌, ఫరీదుద్దీన్‌ తదితరులు ఉన్నారు.

English summary
PM Manmohan singh promised Congress Telanagna public representatives that he will solve the Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X