హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో వైయస్ జగన్ పార్టీ ధర్నాలు నామ మాత్రమే

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తలపెట్టిన సాగుపోరు ధర్నాల ప్రభావం తెలంగాణలో నామ మాత్రంగానే కనిపించింది. తెలంగాణ ప్రభావం జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై తీవ్రంగానే పడింది. వరంగల్‌ ఏకంగా రణరంగంగానే మారింది. తన బలంతో ధర్నా కార్యక్రమం నిర్వహించడానికి శానససభ్యురాలు కొండా సురేఖ చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలకు, తెలంగాణవాదులకు మధ్య ఘర్షణ చెలరేగింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జీపును తెలంగాణవాదులు దగ్ధం చేశారు.

కాగా, మహబూబ్‌నగర్‌లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడానికి ప్రయత్నించారు. అయితే, ఆ ధర్నాను తెలంగాణవాదులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నామ మాత్రంగా ధర్నా జరిగింది. ఈ ధర్నా కార్యక్రమాన్ని సాక్షి టీవీ చానెల్ ప్రత్యేకంగా ప్రసారం చేసింది. రంగా రెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడానికి ప్రయత్నించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. మిగతా జిల్లాల్లో ధర్నాలు జరిగిన సమాచారం అందడం లేదు.

తెలంగాణకు వైయస్ జగన్ అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే తప్ప తెలంగాణ ప్రాంతంలో ఉనికిని చాటుకోవడం సాధ్యం కాదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనుభవం ద్వారా తెలుసుకుంది. తమ ధర్నాను అడ్డుకోవడానికి ప్రయత్నించడంపై కొండా సురేఖ తీవ్రంగా ప్రతిస్పందించారు. జగన్‌తో జై తెలంగాణ అనిపిస్తామని ఆమె చెప్పారు. అయితే, జగన్ తన వైఖరిని స్పష్టం చేసేంత వరకు తెలంగాణలో అడుగు పెట్టడం కష్టంగానే కనిపిస్తోంది.

English summary
It is clear that without taking pro Telangana stand, it is not easy to show its identity in telangana to YSR Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X