హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో నాగం చర్చలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Errabelli Dayakar Rao
హైదరాబాద్: తమ పార్టీ నుంచి సస్పెండ్ అయిన నాగం జనార్దన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డితో గత మూడు రోజులుగా చర్చలు జరుపుతున్నారని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. చర్చలు జరుపుతున్న మాట వాస్తవమా, కాదా చెప్పాలని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో నాగం జనార్దన్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ తెలంగాణ నగారా సభకు వైయస్ జగన్ నాగం జనార్దన్ రెడ్డికి డబ్బులు ఇచ్చారని, ఆ డబ్బులు సరిగా ఖర్చు పెట్టారా, నొక్కేశారా తెలుసుకోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు గోనె ప్రకాశ రావు పర్యవేక్షకుడిగా వచ్చారని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ కూడా వైయస్ జగన్ వద్ద డబ్బులు తీసుకుని కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులపై జగన్ గుండాలు దాడి చేస్తే కెసిఆర్ గానీ కోదండరామ్ గానీ వారిని పరామర్సించడానికి ఆస్పత్రికి ఎందుకు వెళ్లలేదని ఆయన ప్రశ్నించారు. ఇతర పార్టీల నుంచి పదవుల కోసం వచ్చినవారే తెరాసలో ఉన్నారని, కొత్తవారెవరూ లేరని ఆయన అన్నారు. ఈ విషయాలన్నిటిపై తాము కరపత్రం విడుదల చేస్తామని ఆయన చెప్పారు. నాగం నిర్వహించిన తెలంగాణ నగారాలో పాల్గొన్న తమ పార్టీ శానససభ్యులు వేణుగోపాలాచారి, హరీశ్వర్ రెడ్డి, జోగు రామన్నలపై చర్యలు తీసుకునే విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం గూర్ఖాలాండ్‌ తరహా ప్యాకేజీని ప్రకటిస్తే అంగీకరించేది లేదని ఎర్రబెల్లి దయాకరరావు స్పష్టం చేశారు. గూర్ఖాలాండ్‌, తెలంగాణ ఉద్యమాలు వేరువేరని అన్నారు. తెలంగాణ ప్రజలు దీన్ని ఆత్మగౌరవ సమస్యగా భావిస్తున్నారని చెప్పారు.

English summary
TDP Telangana forum convenor Errabelli Dayakar rao alleged that Nagam Janardhan Reddy is holding talks with YSR Congress president YS Jagan camp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X