హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వెళ్లడం నష్టమే, వ్యక్తి గత ఉద్దేశంతోనే పార్టీ పెట్టాడు: బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తి గత ఉద్దేశ్యంతో కాంగ్రెసు పార్టీని వీడి కొత్త పార్టీ పెట్టుకున్నాడని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బుధవారం బషీర్‌బాగ్‌లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో విమర్శించారు. పార్టీ నుండి జగన్ వెళ్లడం వల్ల కొంత నష్టం జరగడం వాస్తవమే అని అయితే దానిని భర్తీ చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. పార్టీలో నుండి కొందరు జగన్ వైపు వెళ్లారని వారు అటు వైపు ఎందుకు వెళ్లారో ఆ దిశలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ మధ్యకాలంలో పార్టీ, ప్రభుత్వం కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి తాను కాంగ్రెసు పార్టీ పూర్వ వైభవానికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వంలో, పార్టీలో మీడియా చేసే విమర్శలను సద్విమర్శలుగానే తీసుకుంటానని స్పష్టం చేశారు.

దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి మృతి తర్వాత కూడా ప్రభుత్వం సంక్షేమ పథకాలు కొనసాగిస్తుందన్నారు. పార్టీలో వ్యక్తులు ముఖ్యం కాదన్నారు. వ్యక్తులు ఉన్నా లేకున్నా కాంగ్రెసు పార్టీ తన పద్ధతిలో తాను వెళుతుందన్నారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని తొలగించారన్నారు. ప్రజా సమస్యలను ముందుగా తెలుసుకొని పరిష్కరించే దిశగా పని చేస్తానని చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో వెనుకడుగు వేయమన్నారు. వైయస్ హయాంలో భారీగా ఆర్థిక వనరులు ఉండేవని కానీ 2009 తర్వాత ఆర్థిక మాంద్యం కారణంగా ఆర్థిక వనరులు తగ్గాయన్నారు. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమన్నారు. పార్టీ నేతల మధ్య అపోహలు ఉండకూడదన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు, అధిష్టానానికి మధ్య సమన్వయకర్తగా పని చేస్తానని అన్నారు. వైయస్ మృతి తర్వాత రోశయ్య, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి బాగా పరిపాలిస్తున్నారన్నారు.

English summary
PCC President Botsa Satyanarayana said that he will solve public problems. He confirmed that schemes will continue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X