హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా కాంగ్రెసు కుట్ర: ఈటెల రాజేందర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Etela Rajender
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాలో అధికార కాంగ్రెసు పార్టీ కుట్ర ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ బుధవారం విమర్శించారు. ప్రభుత్వానికి అండగా ఉన్న కొందరు వ్యక్తులతో ఎన్నికలను ఆపించడానికి కాంగ్రెసు కేసు వేయించిందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే తెలంగాణ ప్రాంతంలో ఓడిపోతామనే భయంతోనే అధికార పార్టీ తప్పించుకోవాలని చూసిందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల నుండి ఇవాళ తప్పించుకున్నప్పటికీ రేపు తప్పించుకోలేరన్నారు.

ఎన్నికలు వస్తే తెలంగాణలో కాంగ్రెసు భూస్థాపితం కాక తప్పదన్నారు. కాంగ్రెసు ఉద్దేశ్య పూర్వకంగానే ఎన్నికలను వాయిదా పడేలా చేసిందన్నారు. ఎన్నికలకు ప్రభుత్వం జంకుతుందన్నారు. తెలంగాణ మంత్రులంతా ఢిల్లీలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గ సమావేశం ఎలా నిర్వహిస్తారని ఈటెల ప్రశ్నించారు.

English summary
TRSLP Etela Rajender unhappy with high court judgement on local body election. He blamed that congress government is not ready to face election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X