రజనీకాంత్‌ను పరామర్శించేందుకు సింగపూర్ వెళ్శిన చిరంజీవి

రజనీకాంత్ సింగపూర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఆయన పూర్తిగా కోలుకున్నారని చెబుతున్నారు. త్వరలోనే రజనీకాంత్ తిరిగి వస్తారని, సెప్టెంబర్‌లో రాణా సినిమా షూటింగ్ జరుగుతుందని చెబుతున్నారు. రాణా రజనీకాంత్ డ్రీమ్ ప్రాజెక్టు. అందువల్ల ఆ సినిమాను వదులుకోవడానికి ఆయన సిద్ధంగా లేరని అంటున్నారు. రాణా షూటింగ్ ప్రారంభం రోజే ఏప్రిల్ 29వ తేదీన రజనీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత చెన్నైలోని ఆస్పత్రిలో మే 13వ తేదీన చేరారు. అనంతరం సింగపూర్ వెళ్లి అక్కడి ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన అభిమానులు త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తూనే ఉన్న విషయం తెలిసిందే.
ఇది మాత్రమే కాకుండా ఇటీవలె ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ తన అభిమానులకు ఓ లేఖని రాయడం జరిగింది. తాను కోలుకోవడానికి అభిమానుల ప్రేమానురాగాలే అని అందులో పేర్కొన్నాడు. రాణా చిత్రం షూటింగును త్వరలో మళ్లీ ప్రారంభిస్తామని చెప్పారు. షూటింగులో పాల్గొంటానని అన్నారు. మళ్లీ సినిమాలతో మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఇంతకాలం మీతో మాట్లాడకుండా ఉన్నందుకు క్షమించాలని అందులో రజినీ తన అభిమానులను కోరారు.