ప్రభుత్వ నిర్లక్ష్యంతో క్రాప్ హాలీడే, హామీతోనే విరమణ అంటున్న రైతులు

క్రాప్ హాలిడేకు అంత సీన్ లేదన్న వ్యాఖ్యలపై రైతు సంఘాలు మండిపడటంతో తాను అలా అనలేదని క్రాప్‌హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితుల్లేవని మాత్రమే అన్నానని అయినప్పటికీ తన వ్యాఖ్యలవల్ల రైతుల మనోభావాలు దెబ్బతింటే బహిరంగ క్షమాపణ చెబుతున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వం గోనె సంచులు సరఫరా చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులకు పావలా వడ్డీ రుణాలు ఇవ్వడం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వ్యవసాయ పనుల సమయంలోనే ఉపాధి హామీ పనులు నిర్వహించడం నష్టం కలిగిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రైతులకు కనీస మద్దతు ధర లేదని పలు రైతు సంఘాలు, పార్టీలు ఆరోపిస్తున్నాయి కూడా. ఇక రైతులు తమకు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు క్రాప్ హాలీడే విరమించే ప్రసక్తి లేదని తేల్చి చెబుతున్నారు.












Click it and Unblock the Notifications