సిఎంకు వంటగ్యాస్ మంట: బొత్సకు ఆనం మద్దతు

వంట గ్యాస్ ధర తగ్గించే ప్రయత్నాలు చేస్తామని ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఈ విషయమై సీనియర్ మంత్రులు సమావేశమై చర్చిస్తామని ఆయన చెప్పారు. దీన్ని బట్టి ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవడానికి బొత్స, ఆనం కార్యాచరణను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల్లో పని చేయాలనే ఉత్సాహం తగ్గిందని, పథకాల అమలు వల్ల అధికారులపై భారం పడుతోందని ఆయన అన్నారు. తెల్ల రేషన్ కార్డుల వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పెరుగుతోందని, ప్రతి యేటా తెల్ల రేషన్ కార్డులు పెరుగుతున్నాయని ఆయన అన్నారు.
రాష్ట్రంలో 30 శాతం మంది మాత్రమే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని లెక్కలు చెబుతుండగా, 50 శాతం తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని, దీనివల్ల ఖజానాపై పెను భారం పడుతోందని ఆయన అన్నారు. తెల్ల రేషన్ కార్డులను నియంత్రించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications