హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాటల్లో దూకుడు తగ్గింది: మారిన బొత్స స్టైల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాటల స్టైల్‌లో మార్పు కనిపిస్తోంది. పిసిసి చీఫ్ కాకముందు ఆయన మాటల్లో దూకుడు కనిపించేది. కానీ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఆచితూచి మాట్లాడుతున్నారు. కాంగ్రెసు పార్టీ నేతలపై ఈగ కూడా వాలనీయడం లేదు. ఇతరులు, మీడియా ఎవరైనా పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేసే తీరు మాట్లాడినా ఆయన వాటిని సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నాడు. పార్టీలో ఎవరినీ నొప్పించకుండా ముందుకు వెళుతున్నాడు. గతంలో జై తెలంగాణ, జై ఆంధ్ర అన్న బొత్స ఇప్పుడు అన్ని ప్రాంతాలలోనూ సమస్యలు ఉన్నాయంటూ ఆచితూచి మాట్లాడుతున్నాడు. అందరి వాడిని అనిపించుకనే బాధ్యత తనపై పడినందు వల్లే ఆయన మాటలలో పదును తగ్గినట్లుగా కనిపిస్తోంది.

ఇటీవల ముఖ్యమంత్రి పదవిపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన సమర్థించాడు. చిరుకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని, అందరూ ఏదో లక్ష్యంతోనే రాజకీయాలలోకి వస్తారని అలా అనుకోవడంలో తప్పు లేదని చెప్పాడు. అంతేకాదు మీడియాకు కూడా క్లాస్ పీకాడు. మీరే ఆ విషయాన్ని భూతద్దంలో చూపిస్తున్నారని మీడియాకు చురకలంటించాడు. ఇక విజయవాడ ఎంపీ లగడపాటి 14ఎఫ్ పై వ్యతిరేకంగా స్పందించిన విషయాన్ని తెలంగాణ బిసి విద్యార్థి సంఘం ఆయన దృష్టికి తీసుకు రాగా లగడపాటి వ్యాఖ్యలను మీరే తప్పు అర్థం చేసుకున్నారని, ఆయన రాజ్యాంగ సవరణ కష్టమన్నారు. కానీ 14ఎఫ్ రద్దుకు వ్యతిరేకంగా మాట్లాడలేదని చల్లబరిచారు. ఇక మంత్రి జానారెడ్డి విషయంలోనూ అలాగే మాట్లాడాడు. ఇలా కాంగ్రెసు పార్టీ నేతలపై ఈగ వాలనీయకుండా పార్టీలో తన పరపతి పెంచుకనే ప్రయత్నంలో బొత్స ఉన్నట్టు కనిపిస్తున్నారు.

English summary
It seems, PCC chief Botsa Satyanarayana changed his style in way of talking. He is trying to move close with all party leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X