అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వచ్చే ఎన్నికలలో జగనే సిఎం: కొండా సురేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Konda Surekha
అనంతపురం: వచ్చే ఎన్నికలలో వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ శుక్రవారం అనంతపురం జిల్లాలో జరిగిన మహాధర్నాలో అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో పార్టీలకతీతంగా అందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూశారని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తానని వైయస్ తన పాదయాత్రలోనే చెప్పారన్నారు. ఆరోగ్యశ్రీ, 2రూ.కిలో బియ్యం తదితర సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టాడని అన్నారు. వైయస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు నిలబెట్టాడని అన్నారు. వైయస్ హయాంలో ఏ ఒక్కరూ ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూడలేదన్నారు. కానీ ఇప్పటి ప్రభుత్వంలో మాత్రం రైతులు, విద్యార్థులు అందరూ రోడ్డెక్కుతున్నారని అన్నారు.

వైయస్ తమ వాడు అంటున్న కాంగ్రెసు ఆయన పథకాలు ప్రవేశ పెట్టడంలో మాత్రం చిత్తశుద్ధి కనబర్చడం లేదన్నారు. సిఎం కిరణ్ ప్రతి నిర్ణయానికి అధిష్టానం వైపు చూస్తారని, మిగిలిన నేతలంతా పదవుల కోసం పాకులాడుతూ పాలనను పక్కన పెడుతన్నారన్నారు. జగన్ ఇప్పటికీ ఏడెనిమిది దీక్షలు చేశారని అయితే ప్రభుత్వం ఆ దీక్షలను పట్టించుకోక పోయినప్పటికీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు మాత్రం జగన్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుండబెడతారని అన్నారు. వైయస్సాఆర్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడుతుందన్నారు.

అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు వైయస్‌ను గుర్తు చేసుకుంటున్నారని నెల్లూరు జిల్లా పార్లమెంటు శాసనసభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. గతంలో గ్యాస్ ధర పెరిగినప్పుడు రాష్ట్ర ప్రజలపై భారం పడకుండా వైయస్ రాష్ట్రం తరఫున రూ.50 రూపాయలు భరించారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు గ్యాస్ ధరలు పెరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ భారం ప్రజలపైనే వేయాలని చూస్తుందన్నారు. జూలై 9న ఇడుపులపాయలో వైయస్సాఆర్ పార్టీ ప్లీనరీలో జగన్ పార్టీ విధివిధానాలు ప్రకటిస్తారని చెప్పారు. వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీలో సభ్యుడిగా ఉండటమే గౌరవం అన్నారు. రాబోయే రోజుల్లో వైయస్ జగన్‌ను గెలిపిస్తే రాష్ట్ర ప్రజలకు మెరుగైన జీవితాన్ని ఇస్తారని అన్నారు.

English summary
YS Jagan camp congress MLA Konda Surekha blamed CM Kiran Kumar Reddy government today. She called people to make Jagan as CM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X