టిడిపితో కలిసి వెళతాం, బస్సు యాత్రకు ఓకే: కోదండరామ్

Kodandaram
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేసిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలను ఒంటరి చేయమని వారిని కలుపుకొని వెళతామని తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ గురువారం స్పష్టం చేశారు. తెలంగాణ సాధన కోసం తెలుగుదేశం పార్టీ తన కార్యక్రమాలు తాను చేసుకోవచ్చునని చెప్పారు. అలాగే ఐక్యవేదిక సైతం వారిని కలుపుకు పోతుందన్నారు. పార్టీలు తమ తమ కార్యక్రమాలు చేసుకుంటూ ఐక్యవేదిక కార్యక్రమాలలో పాల్గొనడంలో తప్పు లేదన్నారు. టిడిపి బస్సు యాత్రకు అడ్డు లేదన్నారు. ఇప్పటి వరకు టిడిపితో కలిసి వెళ్లాలనే తమకు ఉందన్నారు. ఈ నెల 9, 10వ తేదీల్లో చేపట్టిన రైలు రోకో, వంటా వార్పు కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. ఆ తేదీల్లో రాజీనామా చేసిన నేతలందరితో కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రజాప్రతినిధులతో సమావేశం తరువాత ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. రాజీనామాల కారణంగానే కేంద్రంలో కదలిక మొదలైందని అన్నారు. తెలంగాణ ప్రాంత నేతలు పార్టీలకతీతంగా రాజీనామాలు చేసి కేంద్రంలో కదలిక తీసుకు రావడం మంచి విషయం అన్నారు. ఐక్య వేదిక ప్రతిపాదనపై అన్ని సంఘాలు సానుకూలంగా స్పందించాయని చెప్పారు. ఉమ్మడి కార్యాచరణలో రాజీనామా చేసిన నేతలంతా పార్టీలకతీతంగా పాల్గొంటారన్నారు. రాజీనామా చేయని వారిని కలుపుకొని వెళ్లే ప్రసక్తి లేదన్నారు. సీమాంధ్ర నేతలు తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. రాజీనామా చేసిన నేతలను ఢిల్లీకి తీసుకు వెళ్లి పరేడ్ చేయించాలనే యోచనలో ఉన్నట్లు చెప్పినట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+