కోదండరామ్‌కు కాంగ్రెసు ఎమ్మెల్యే దామోదర్ రెడ్డి షాక్

R Damodar Reddy
హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్‌కు కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శానససభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి షాక్ ఇచ్చారు. తాము జెఎసిలో భాగస్వాములం కాదని, తమపై జెఎసి పెత్తనం చేయడం సరి కాదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాజీనామా చేసిన తమ పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటారని ఆనయ చెప్పారు. రాజీనామా చేసిన పార్టీల నేతలంతా కలిసి నిర్ణయం తీసుకుంటే తాము పాలు పంచుకుంటామని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులు బస్సు యాత్ర చేపట్టినట్లుగానే తాము విడిగా కార్యక్రమం చేపట్టే విషయంపై ఆలోచన చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది తామే కాబట్టి తమపై బాధ్యత ఎక్కువ ఉంటుందని, అందువల్ల భవిష్యత్తు కార్యాచరణపై వేచి చూస్తున్నామని ఆయన అన్నారు. సమస్య జఠిలమైంది కాబట్టి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకుని తెలంగాణకు అనుకూలంగా పార్టీ సీమాంధ్ర నాయకులను ఒప్పించాలని ఆయన అన్నారు. అయితే, సీమాంధ్ర నేతలతో తాము సమావేశమయ్యే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. తాము ఎవరితోనూ కలిసి సమావేశం నిర్వహించబోమని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+