తెలంగాణ ఉమ్మడి వేదికకు కోదండరామ్ యత్నాలు

కోదండరాం టిడిపి నుండి బహిష్కరించబడిన నాగం జనార్దన్ రెడ్డిని కలుస్తారు. తెలుగుదేశం పార్టీని సైతం కలుస్తానని చెప్పారు. రాజీనామా చేసిన వారందరినీ కలుపుకొని పోతామని ఆయన చెప్పారు. న్యూఢిల్లీలో తెలంగాణ ఆకాంక్షను గట్టిగా వినిపించాలని ఆయన కోరారు. ఉమ్మడి కార్యాచరణపై సమాలోచనలు జరుపుతున్నామని వరంగల్ పార్లమెంటు సభ్యుడు రాజయ్య వేరుగా చెప్పారు. ప్రజల మనోభావాలకు అధిష్టానం విలువ ఇవ్వాలన్నారు. కేంద్రం వెంటనే తెలంగాణను ప్రకటించాలి. లేదా రాజీనామాలు ఆమోదించాలని డిమాండ్ చేశారు. తమతో కలిసి వచ్చే వారిని కలుపుకొని పోతామని చెప్పారు.












Click it and Unblock the Notifications