వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్‌ను ప్రజలు నమ్మడం లేదు: మంత్రి డిఎల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy
విశాఖపట్నం: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎవరూ నమ్మడం లేదని మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి సోమవారం అన్నారు. ఎమ్మార్ విషయంలో హైకోర్టు నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎమ్మార్ అక్రమాల కారణంగా జగన్ మీడియాలోకి భారీగా పెట్టబడులు వెళ్లాయని తాను పలుమార్లు పలు వేదిలపై స్పష్టం చేశానని గుర్తు చేశారు. ఎమ్మార్ విషయంలో హైకోర్టు ఇప్పటికీ ఓ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం అన్నారు. కోర్టు తీరు హర్షణీయం అన్నారు. వైయస్ జగన్ తన మొదటి ప్లీనరీలో చేయలేని వాగ్ధానాలు చేశారని అన్నారు. కెజి నుండి పిజి వరకు ఉచిత విద్య అనేది ప్రాస కోసం వాడిందే అని చెప్పారు.

కాగా తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధుల రాజీనామా వ్యవహారం రెండుమూడు రోజుల్లో తేలుతుందన్నారు. తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తొందరగా తీసుకోవాలని అధిష్టానానికి చెప్పానని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం బాగా పని చేస్తోందన్నారు. విశాఖ మన్యంలో విషజ్వరాలు నిజమే అని అన్నారు. కేంద్రం నుండి 10 లక్షల దోమతెరలు అడిగామని కేంద్రం అందుకు సమ్మతించిందన్నారు. ఏజెన్సీలో మౌలికా వైద్య సదుపాయాల కోసం 10 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు చెప్పారు. 104, 108లను ఇంటిగ్రేట్ చేస్తామని చెప్పారు.

English summary
Minister DL Ravindra Reddy said today that people are not confident on ysr congress party president ys jaganmohan reddy. He welcomed high court justice on emaar issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X