వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బహిష్కరిస్తాం: మీడియాకు టి-కాంగ్రెసు హెచ్చరిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

Damodar Reddy
హైదరాబాద్: తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు సోమవారం మీడియాపై తీవ్రస్థాయిలో పైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమాన్ని కొందరు అవహేళన చేస్తూ మరికొందరు తక్కువ చేసి చూపిస్తూ కధనాలు ప్రసారం చేస్తున్నారని మంత్రి జానారెడ్డి అన్నారు. మీడియా ప్రజల మనోభావాలను ప్రతిబింబించేలా ఉండాలని సూచించారు. మీడియా అవాస్తవ కథనాలు ప్రసారం చేయడం సరికాదని అన్నారు. మీడియా అవాస్తవ కథనాలు ప్రసారం చేస్తే కేబుల్ వ్యవస్థను స్తంభింపజేస్తామని రాంరెడ్డి దామోదర రెడ్డి హెచ్చరించారు. మీడియా వార్తలు ప్రసారం చేయడంలో సంయమనం పాటించాలని సూచించారు. అవాస్తవ కథనాలు ప్రసారం చేస్తే ప్రెస్ కొన్సిల్‌కు ఫిర్యాదు చేస్తామని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి హెచ్చరించారు. మమ్మల్ని కించపరిచేలా రాస్తే మీడియాను బహిష్కరించడానికి వెనుకాడం అన్నారు. సీమాంధ్రుల అభ్యంతరాలపై చర్చించేందుకు సిద్ధమని ఎంపి కె కేశవరావు అన్నారు. సమావేశానికి అందరు రాకుంటే ఐక్యత లేదని అనుకోవద్దని కోరారు.

కాగా నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్సులో జరిగిన సమావేశంలో టి-కాంగ్రెసు ఐదు తీర్మానాలు చేసింది. అవి... తెలంగాణ ప్రకటించే వరకు రాజీనామాలు వెనక్కి తీసుకోరాదు. రాజీనామాలు చేసిన అందరు ప్రజాప్రతినిధులు 48 గంటల దీక్షలో పాల్గొనాలి. విద్యార్థులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. తెలంగాణ ఉద్యమం ఐక్యంగా చేయాలి. ఉద్యమాన్ని కించపరుస్తూ వార్తలు రాస్తే ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయాలి.

English summary
Telangana congress leaders warned media today after their meeting. They blamed that media broadcosting wrong news.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X