హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓయూ క్యాంపస్‌ విదేశీ సరిహద్దులా ఉంది: కోదండరామ్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్‌: ఓయూ విషయంలో ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని, విదేశీ సరిహద్దులు దాటేందుకు కూడా ఇంత ఇబ్బంది ఉండదని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం అన్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయం వాఘా సరిహద్దును తలపిస్తోందన్నారు. ఉద్యోగసంఘాల నేతలు స్వామిగౌడ్‌, శ్రీనివాసగౌడ్‌లతో కలిసి ఆయన ఓయూకు వచ్చి విద్యార్థుల దీక్షకు మద్దతు పలికారు.

అంతక ముందు ఓయూ క్యాంపస్‌లో పారామిలటరీ బలగాలను మోహరించలేదని, స్థానిక పోలీసులు మాత్రమే ఉన్నారని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ఏకే ఖాన్‌ తెలిపారు. పరిసర ప్రాంతాల రక్షణ కోసం క్యాంపస్‌ బయట మాత్రమే బలగాలున్నాయన్నారు. విద్యార్థులు శాంతియుతంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా తమకు అభ్యంతరం లేదన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఓయూ క్యాంపస్‌లోపల విద్యార్థులు, సిబ్బంది మినహా బయటి వ్యక్తులు ఉండటానికి వీలులేదని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్పష్టం చేశారు.

ఇతర యూనివర్శిటీలు, కళాశాలల విద్యార్థులు కూడా ఓయూ లోపల కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి లేదన్నారు. క్యాంపస్‌ లోపల కొంతమంది బయటి వ్యక్తులున్నట్లు తమ వద్ద స్పష్టమైన సమాచారం ఉందని తెలిపారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించినందుకు, అల్లర్లు సృష్టించవచ్చునన్న అనుమానం ఉన్నవారిని కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఏకేఖాన్‌ తెలిపారు. ఓయూ పరిసరాలను సందర్శించి ఖాన్‌ పరిస్థితిని సమీక్షించారు.

English summary
Telangana JAC Chairman prof Kodandaram says OU Campus looking like wagah border.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X