న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతిలో కీలు బొమ్మ అని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. సోనియా చేతిలో తాను తోలు బొమ్మను కాదని స్వయంగా మన్మోహన్ సింగ్ ఇటీవల ఎడిటర్స్ భేటీలో చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ విషయంలోనైనా ఆయన ఆదేశాలకు అంతగా విలువ ఉండదని తెలిసిన విషయమే. అమ్మ అదేశాలే ఆయన ఆదేశాలుగా చలామణి అవుతుంటాయి. తనకు ఇష్టం లేకున్నా అమ్మ ఆదేశాలే ఫైనల్. ప్రధాని నిస్సహాయత గురించి తెలిసిన మంత్రులు ఆయన ఆదేశాలు బేఖాతరు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆదివారం అసోంలో జరిగిన ఘోర రైలు ప్రమాదం విషయంలో ప్రధాని ఆదేశాలను రైల్వే శాఖ మంత్రి ముకుల్ రాయ్ నిర్ద్వందంగా తోసిపుచ్చారు.
అసోంలో ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లాల్సిందిగా ప్రధాని ముకుల్‌ను ఆహ్వానించారు. అయితే తాను వెళ్లనని నిక్కచ్చిగా చెప్పారని సమాచారం. అవసరమైతేనే వెళతానని చెప్పారంట. అంతేకాదు తాను ప్రమాద స్థలికి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్నానని ఎలా వెళ్లగలనని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారంట. సంబంధింత అధికారులు వెళతారని ప్రధానికి ఉచిత సలహాలు ఇచ్చారంట. ముకుల్ రాయ్ తీరుపై ప్రధాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.