న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి వర్గంలో ఇక ఆంద్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులకు చోటు దక్కే అవకాశాలు ఎంత మాత్రమూ లేవు. ఇంతటితో సరిపెట్టుకోవాల్సిందే. 2014 ఎన్నికలకు ముందు ఇదే ఆఖరి మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ అని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తేల్చేశారు. మరో మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ ఎన్నికల లోపు ఉండదని ఆయన తేల్చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులు సరిపెట్టుకోవాల్సిందే. సంకీర్ణ ధర్మంలో భాగంగా డిఎంకెకు రెండు సీట్లు ఖాళీగా ఉంచామని ఆయన చెప్పారు. కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మంగళవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
వివిధ రాష్ట్రాల మధ్య సమతూకాన్ని, సామర్థ్యాన్ని, కొనసాగింపును పరిగణనలోకి తీసుకుని పునర్వ్యస్థీకరణ చేసినట్లు ఆయన తెలిపారు. తనకు సంబంధించినంత వరకు ఎన్నికలకు ముందు మళ్లీ మంత్రివర్గంలో మార్పులు ఉండవని ఆయన అన్నారు. పునర్వ్యస్థీకరణ జరిగిన తర్వాత కొంత మంది మంత్రుల్లో శాఖలపై అసంతృప్తి ఉండడం సహజమి, దేశ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్నామని ఆయన అన్నారు. డిఎంకె నుంచి త్వరలో రెండు మంత్రి పదవుల కోసం సూచనలు వస్తాయని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ పార్టీ పనిలో బిజీగా ఉన్నారని ఆయన అన్నారు.
In a surprise statement, Prime Minister Manmohan Singh said today's reshuffle of his Council of Ministers is the last before the Lok Sabha polls in 2014 but two slots have been kept vacant for DMK as part of "coalition dharma".
Story first published: Tuesday, July 12, 2011, 19:02 [IST]