బొత్స ఆ మాట చెప్పలేదు: ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తనను రాజీనామా ఉపసంహరించుకోమని కోరలేదని జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు పి.విష్ణువర్దన్ రెడ్డి మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఆయన మధ్యాహ్నం పిసిసి చీఫ్ బొత్సతో గాంధీభవన్‌లో భేటీ అయ్యారు. భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తూ రాజీనామాలు చేసిన వారందరినీ బొత్స పిలిచి మాట్లాడుతున్నారని, తనను సైతం బొత్స పిలిచారని అందుకే వచ్చానని అన్నారు.
తాము ప్రత్యేక తెలంగాణ తప్ప మరే దానికి అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. హైదరాబాదులో ఉన్న సెటిలర్స్ ఎవరూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించడం లేదన్నారు. సెటిలర్స్ భవిష్యత్తుకు హామీ ఇస్తామని చెప్పారు. కాగా తెలంగాణ కోసం రాజీనామా చేయాలని తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు నిర్ణయించుకున్న సమయంలో అందరికంటే ముందుగా విష్ణువర్దన్ రెడ్డియే రాజీనామాతో అసెంబ్లీకి వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు హైదరాబాదు నగరం నుండి రాజీనామా చేసిన మొదటి వ్యక్తి సైతం విష్ణుయే.