అంతా చూస్తుండగా ఓ వ్యక్తిని కొట్టి చంపారు

ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై నిలబడి, మోటార్ సైకిల్‌కు అడ్డం వచ్చినట్లు, దాంతో అతను బ్యాలెన్స్ తప్పి పడిపోయినట్లు సిసిటివీలో రికార్డయింది. వారికి మరో ఇద్దరు తోడై పడిపోయిన మోటార్ సైక్లిస్టుపై విరుచుకుపడ్డారు. కింద మీద పడేసి కొట్టి చంపారు. దుండగుల్లో ఒకతను కత్తితో పొడిచాడు. మరొకడు మోటార్ సైక్లిస్ట్ తలపై రాయి విసిరాడు. దాడిని చూస్తూ కూడా ఆపడానికి ప్రయత్నించనివారిని కోయంబత్తూర్ డిప్యూటీ పోలీసు కమిషనర్ నిజాముద్దీన్ తప్పు పట్టారు. పోలీసులు వచ్చి బాధితుడిని ఆస్పత్రిలో చేర్చే లోగానే మరణించాడని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications