ఖమ్మం: తెలంగాణ ఇస్తారా లేదా ఏదో ఒకటి వెంటనే తేల్చేయండని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్‌ను తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు బుధవారం డిమాండ్ చేశారు. తొమ్మిది రోజుల బస్సుయాత్ర ఖమ్మం జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణపై కేంద్రం దాడుగు మూతలు ఆడుతుందని ధ్వజమెత్తారు. తెలంగాణ ఇస్తారా లేదా ఆజాద్ తేల్చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ -3పై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మరో నేత దేవేందర్ గౌడ్ విమర్శించారు.
దేశంలోనే అతిపెద్ద రాజకీయ దోపిడీదారుడు వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ఖమ్మం జిల్లా పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు దుయ్యబట్టారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని వైయస్ కుటుంబం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. జగన్‌కు ఊచలు లెక్కబెట్టే సమయం ఆసన్నమైందని అన్నారు. జగన్ ఆస్తులపై సిబిఐ దర్యాఫ్తుకు ఆదేశించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నట్టు చెప్పారు.