ఆజాద్‌కు బుద్ధీజ్ఞానం లేదు: తెలంగాణ నేత కేశవరావు

ఎఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ వద్ద ఆజాద్ పాఠాలు నేర్చుకోవాలని ఆయన సూచించారు. న్యాయశాస్త్రంలో సింఘ్వీ నిపుణుడని, తెలియకపోతే ఆజాద్ సింఘ్వీ వద్దకు వెళ్లాలని ఆయన అన్నారు. తెలంగాణ వ్యతిరేక వైఖరితో ఆజాద్ అలా మాట్లాడారని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ గురించి ఆజాద్ చైనాలో ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి మూడు ప్రతిపాదనలు చేస్తున్నట్లు సింఘ్వీ సూచనప్రాయంగా వెల్లడించిన నేపథ్యంలోనే దాన్ని తిప్పికొట్టడానికి ఆజాద్ అలా మాట్లాడారని ఆయన విమర్శించారు. కొత్త రాష్ట్రాలు కూడా అసెంబ్లీ తీర్మానం లేకుండానే ఏర్పడ్డాయని ఆయన అన్నారు. ఆజాద్‌పై పార్టీ అధిష్టానానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు కేశవరావు సిద్ధపడుతున్నారు.












Click it and Unblock the Notifications