కాంగ్రెసు కోర్ కమిటీ భేటీ, తెలంగాణపై తేలుస్తారా?

తెలంగాణ సమస్యను సాధ్యమైనంత త్వరలో పరిష్కరించాలని కాంగ్రెసు అధిష్టానం అనుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసిన నేపథ్యంలోనే కాకుండా సీమాంధ్ర పార్టీ నాయకుల అభిమతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని తెలంగాణ సమస్యకు ఒక పరిష్కారం కనుక్కునే వేటలో అధిష్టానం ఉంది. తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర పార్టీ నాయకులు కూడా కోరుతున్నారు. ఇంక ఎంత మాత్రమూ జాప్యం చేయడానికి వీల్లేదని గ్రహించిన పార్టీ అధిష్టానం వారంలో గానీ పది రోజుల్లో గానీ తెలంగాణపై ఓ ప్రకటన చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
కోర్ కమిటీ భేటీ తర్వాత గులం నబీ ఆజాద్ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారిద్దరి మధ్య 15 నిమిషాల పాటు సమావేశం జరిగింది. కోర్ కమిటీలో ముంబై పేలుళ్లపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications