నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఆస్తులు హైకోర్టుకు మిస్టరీ: ఆనం వివేకా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anam Vivekananda Reddy
నెల్లూరు: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మూడేళ్లలో లక్షల కోట్లు ఎలా వచ్చాయనే ఉద్దేశ్యంతోనే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు జగన్ ఆస్తులపై ప్రాథమిక దర్యాఫ్తుకు ఆదేశించిందని ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా శాసనసభ్యుడు ఆనం వివేకానందరెడ్డి శుక్రవారం అన్నారు. కేసు విషయంలో జగన్ సుప్రీం కోర్టుకు వెళ్లక పోవడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. అవినీతి విషయంలో కాంగ్రెసు పార్టీకి పరతమ బేధాలు లేవన్నారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ నుండి పివి నరసింహా రావు వరకు అందరూ న్యాయస్థానం ముందు చేతులు కట్టుకొని నిలబడ్డవారే అని అన్నారు. జగన్ ఆస్తులపై సిబిఐ దర్యాఫ్తు విషయంలో ఎలాంటి కుట్ర లేదన్నారు.

తెలంగాణ విషయంలో సమైక్యవాదులకు సహనం అవసరమన్నారు. తెలంగాణ విషయంలో టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధులు ఎంతగా రెచ్చగొట్టినా తాము రెచ్చిపోమని అన్నారు. తాము సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. తెలంగాణ నేతలు ఆవేశంలో ఎన్ని మాటలైనా అంటారని సీమాంధ్రులు సంయమనం పాటించాలని సూచించారు.

English summary
MLA Anam Vivekananda Reddy said today that high court order for cbi probe on Jagan property with suspecting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X