వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై పేలుళ్లలో రోడ్లపై కోట్ల విలువ చేసే వజ్రాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Mumbai Balsts
ముంబై: ముంబై ఒపేరా హౌస్ వద్ద సాయంత్రం బాంబు విస్ఫోటం. వెంటనే పైనుండి ఏవో జలజలా రాలాయి. అవి మరేమీ కాదు ! కళ్ళు మిరుమిట్లు గొలిపే వజ్రాలు ! వజ్రాల వర్తకులు చిన్న చిన్న పేపరులో చుట్టి తమ దుస్తులలోని సీక్రెట్ పాకెట్లలో దాచుకున్నవి. సరిగ్గా ఆరోజు ముంబై నగరంలోని ఒపేరా హౌస్ ప్రాంతంలో బాంబులు పేలినపుడు ఈ వర్తకులు తమ దైనందిన వ్యాపారాలను ముగించి వేడి చాయ్ తాగుతూ లేదా అలవాటు మేరకు పాన్ నములుకుంటూ వాటిని తమ ఇనప్పెట్టెలలో భద్ర పరచుకోడానికి వెళ్ళబోతున్నారు. మరి కొందరు ఆ రోజు చివరకు వ్యాపారంలో మిగిలిన వజ్రాలను రెడ్ వెల్వెట్ పై పరచి చివరి సారిగా లెక్కించుకుంటున్నారు.

ఒపేరా హౌస్ వద్దగల ఇరుకైన ఖావ్ గల్లీ బాంబు విస్ఫోటానికి దద్దరిల్లింది. వజ్రాల వర్తకులు చెల్లాచెదురయ్యారు. బహుశ, వినటానికే ఆశ్చర్యం వేస్తుంది, నమ్మశక్యం కాదు. కాని, ఈ వర్తకులు అతివిలువైన ఈ వజ్రాల వ్యాపారాలను, వజ్రాలను తమ తమ జేబులలో వుంచుకొని సాగిస్తూంటారని ముంబై డైమండ్ అసోసియేషన్ కార్యదర్శి భరత్ వి. షా తెలియజేశారు. కొంతమంది వర్తకులు సమీపంలోని చెట్ల క్రిందా లేదా టీ స్టాళ్ళలోను కూడా తమ వ్యాపారం చేస్తూంటారట కూడాను. కొంతమంది మూసివున్న తమ గుప్పిటలో పెట్టుకొని కూడా సాయంకాలం ఏడున్నర గంటల వరకు వ్యాపారం చేస్తారు. లేదా వాటిని పోకెట్లలో దాచుకొనే చాయ్ కు లేదా బిస్కట్కు వెళుతూంటారు.

ఇదే సమయంలో బాంబు విస్ఫోటం జరగటంతో చాలామంది తమ వజ్రాలను కోల్పోయారు. అంచనాల మేరకు వీరంతా సుమారు రూ.25 కోట్ల విలువైన వజ్రాలను విస్ఫోటంలో కోల్పోయినట్లు సంజయ్ షా చెపుతున్నారు. వారు బతికి బయటపడ్డా, ఇపుడు ఆ ప్రదేశానికి పోవటానికి పోలీసులు వారికి అనుమతి ఇవ్వటం లేదు. ఆ ప్రాంతం కావలి కాస్తున్న సెక్యూరిటీకి లేదా ఫోరెన్సిక్ నిపుణులకు ఈ వజ్రాలు దొరికి వుండవచ్చని కూడా వారు భావిస్తున్నారు.

వజ్రాల సంగతి ఏది ఏమైనప్పటికి మా మనుషుల ప్రాణాలు ఎగిరిపోయాయి. మాకు భధ్రత ఎక్కడ అని సంజయ్ షా వాపోయారు.ఈ ప్రాంతానికి స్ధానిక వర్తకులేకాక ఇతర ప్రాంతాల వారు సైతం వచ్చి వ్యాపారాన్ని నిర్వహిస్తారు. ఈ దుర్ఘటనలో సుమారు వందమంది వరకు గుజరాతి వ్యాపారులు గాయపడి ఆస్పత్రి పాలైనట్లు, కొందరు తీవ్రంగా గాయపడగా మరి కొందరు అక్కడికక్కడే మరణించినట్లుగా కూడా తెలుస్తోంది. ఫలితంగా డైమండ్ మార్కెట్ రెండు లేదా మూడు రోజులపాటు మూసివుండగలదు.

English summary
Not everyone who was affected by the blast was from Mumbai. A large number of diamond brokers spend the working week in the city and return home to Bhavnagar and Surat on the weekend.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X