హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'టిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్ ఎదుట డాన్సుల వెనుక కుట్ర'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kadiyam Srihari
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు చేపట్టిన 48 గంటల దీక్షా శిబిరంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వచ్చి సంఘీభావం చెప్పిన సమయంలో కాంగ్రెసు నేతలు డాన్సులు చేయడం చూస్తుంటే ఓ డ్రామాగా, రాజకీయ కుట్రగా అనిపిస్తుందని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి శుక్రవారం అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ విషయంలో మోసం చేసే కాంగ్రెసుకు కెసిఆర్ సంఘీబావం తెలపడం దేనికి సంకేతం అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చేది మేమే తెచ్చేది అంటున్న కాంగ్రెసుకు సంఘీభావం తెలిపితే కెసిఆర్ పోరాటం ఎవరి మీద చేస్తున్నారని ప్రశ్నించారు.

కాగా శుక్రవారం టిడిపి పోలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై హైకోర్టు సిబిఐ దర్యాఫ్తుకు ఆదేశించడాన్ని స్వాగతించారు. పొరుగు రాష్ట్రాలలో అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై పోలిట్ బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది.

English summary
TDP polit buearo member Kadiyam Srihari suspected that there is conspiracy behind dance in T-Congress 48 hours fast.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X