విజయవాడ: మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న విజయవాడ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు దేవినేని ఉమా మహేశ్వర రావు, నగర అధ్యక్షుడు వల్లభనేని వంశీ శుక్రవారం ఓకే వేదికపై పక్కపక్కనే కూర్చుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇటీవల చంద్రబాబు నాయుడు, నందమూరి హరికృష్ణ విషయంలో ఉమ, వంశీల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణను దేవినేని అవమానపరిచారని వంశీ ఉమపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇరువురు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ మీడియాకు సైతం ఎక్కారు. ఇరువురు రాజీనామాల వరకు వెళ్లారు. ఆ తర్వాత హైదరాబాదు వచ్చి చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత వంశీ కాస్త వెనక్కి తగ్గాడు.
తమ మధ్య ఎలాంటి వివాదం లేదని ఇద్దరం కలిసి జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని వంశీ ప్రకటించారు. ఆ తర్వాత శుక్రవారం ప్రభుత్వం పెంచిన ఆర్టీసి ధరలకు నిరసన తెలిపేందుకు విజయవాడలో బస్సు డిపోల ముందు టిడిపి, సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో వంశీ, దేవినేని ఉమ పక్క పక్కనే కూర్చుని ప్రభుత్వంపై నిప్పులు గక్కారు. ప్రభుత్వం అన్ని ధరలను పెంచుతూ ప్రజలపై భారం మోపుతుందని విమర్శించారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇటీవలె పెట్రోలు, డిజిల్, కిరోసిన ధరలు పెంచారని విమర్శించారు.
TDP senior leaders Vallabhaneni Vamsi and Devineni Uma Maheswara Rao two were participated in dharna at Vijayawada. They lashes out at government for raising charges.
Story first published: Friday, July 15, 2011, 12:19 [IST]