వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మా మద్దతు: గడ్కారీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Nitin Gadkari
లండన్: దేశాభివృద్ధిలో భాగంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటును తాము స్వాగతిస్తామని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ అన్నారు. తెలంగాణా అభివృద్ధి ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం లండన్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి నితిన్ హాజరయ్యారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని నితిన్ స్పష్టం చేశారు.

తెలంగాణ ఏర్పాటు అంశానికి సంబంధించి లోక్ సభలో తీర్మానాన్ని ప్రవేశపెడితే ఆ తీర్మానానికి తమ సభ్యులు మద్దతునిస్తారని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణా డిమాండ్ల సాధనకు భాజపా కృషి చేస్తుందని , తెలంగణా వాదులు చేస్తున్న పోరాటాలకు తమ పార్టీకి చెందిన 165 ఎంపీలు అండగా నిలుస్తారని గడ్కారీ హామి ఇచ్చారు.

2004, 2007లో తెలంగాణాకు అనుకూలమని ప్రకటించి అక్కడి వారి మద్దతు కూడగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకోలేక పోయిందని ఎండగట్టారు. ఉద్యమంలో భాగంగా ప్రత్యేక తెలంగాణాను కోరుతూ 143 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ సభ్యులు రాజీనామ చేసినప్పటికి సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ సర్కారు కృషి చేయకపోవటం రాజకీయ అనుభవలేమిగా అభివర్ణించారు.

శ్రీ కృష్ణ కమిటీ నివేదికలను పరిగణలోకి తీసకున్న కాంగ్రెస్, తెలంగాణా వ్యవహారం పై నాన్చుడు ధోరణిని అవలంభిస్తుందని గడ్కారీ విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నత్తనడకన సాగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయటంతో పాటు తెలంగాణా జాలల విషయంలో అవాంతరాలను తొలగిస్తామని గడ్కారీ స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రజలకు కృష్ణా గోదావరి జలాలు సమృద్ధిగా అందించటంతో పాటు వెనుకబడి ఉన్న అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని హామి ఇచ్చారు. భారతీయ జనతా మోర్చా అధ్యక్షురాలు, ఎంపీ స్మృతీ ఇరానీతో పాటు పార్టీ ఓవర్ సీస్ కన్వీనర్ విజయ్ జోలీ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

English summary
The BJP supports the demand for the formation of a separate Telangana state, party president Nitin Gadkari has said, citing its policy of favouring the creation of smaller states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X