భార్యను చంపి పెట్టెలో పెట్టిన కిరాతక టెక్కీ

Techie
నోయిడా: కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. ఐదు సంవత్సరాల క్రితం ఒక్కటైన ఆ ఏడు అడుగుల బంధం క్షణికావేశంలో ముక్కలైంది. కోపం ఆపుకోలేని టెక్కీ భర్త తాళం చెవితో భార్య తలపై మోది హతమర్చాడు. అనంతరం ఆమె మృత దేహాన్ని పెట్టెలో కట్టి మంచం కింద దాచి పెట్టాడు. చివరికి తాను చేసిన నేరాన్ని అంగీకరించటంతో పోలీసులు అదుపులో ఊచలు లెక్కపెడుతున్నాడు. నోయిడా ప్రాంతంలో సంచలనం సృష్టించిన ఈ ఉధంతం పై వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ భవానీ పూర్ ప్రాంతానికి చెందిన షావేంద్ర మిశ్రా (24), ప్రజ్ఞ (22)లకు 2005 జూన్ 22వ తేదీన వివాహం జరిగింది. అయితే వీరు 2009 నుంచి కలిసి ఉంటున్నారు. బీటెక్ పూర్తి చేసిన షావేంద్ర సాఫ్ట వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంటే, ప్రజ్ఞ ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తుంది. ఈ మధ్యనే దంపతులిద్దరు నోయిడా, కె - బ్లాక్ సెక్టర్ లోని 11వ బ్లాక్ లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. సాఫీగా సాగుతున్న వీరి జీవితంలో మనస్పర్థలు తలెత్తాయి. అయితే ఇవి శనివారం రాత్రికి మరింత ఉధృతి దారితీశాయి. దీంతో సహనం కోల్పొయిన షావేంద్ర భార్యను బలమైన ఇనుప తాళంతో మోది హతమర్చాడు. విషయం తెలుసుకన్న ప్రజ్ఞ బంధువు ఒకరు పోలీసులకు సమచారాన్ని అందించారు. తాను ప్రజ్ఞను హత్యచేసినట్లు ఆమె నాన్న శివ ప్రసాద్ దూబే వద్ద ఆ టెక్కీ ఒప్పుకున్నాడు.

ధర్యా ప్తులో భాగంగా పోలీసులు దంపతులు నివసిస్తున్న గది తెలుపును తెరిచి చూడగా రక్తపు మడుగులో ఉన్న ప్రజ్ఞ మృతదేహం పడకగదిలో మంచం కింద ఒక పెట్టెలో మూట కట్టి ఉంది. హత్యకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు ఫోరెనిక్స్ ల్యాబ్ కు తరలించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, తదుపరి కుటుంబసభ్యులకు అందించినట్లు పోలీసు అధికారి జయంత్ తెలిపారు. అద్దెకు తీసుకున్న ఇంటిలో దంపతులిద్దరూ వేరు వేరు గదుల్లో నవసిస్తున్నారని ఆధారాలు సేకరించిన నోయిడా పోలీసు బృందం తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+