హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విచారణపై జగన్ సుప్రీంకు వెళ్లలేదు: అంబటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ ప్రాథమిక విచారణను నిలుపు చేయాలంటూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసినట్లు వచ్చిన వార్తలను ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మంగళవారం కొట్టిపారేశారు. జగన్ తన కంపెనీలపై సిబిఐ చేస్తున్న దర్యాఫ్తును నిలుపు చేయాలంటూ సుప్రీం కోర్టుకు వెళ్లలేదన్నారు. జగన్‌కు కోర్టుకు వెళ్లవలసిన అవసరం లేదన్నారు. సుప్రీం కోర్టులో జగన్ తరఫు న్యాయవాదులు ఎవరూ లీవ్ పిటిషన్ వేయలేదన్నారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు సంబంధించిన వారెవరైనా పిటిషన్ వేయవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.

కాగా అంతకుముందు తన ఆస్తులపై సిబిఐ విచారణ ఆపించాలని కోరుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. సుప్రీంకోర్టులో ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఎస్.ఎల్.పి పై విచారణ పూర్తయ్యేవరకు ఎలాంటి విచారణ చేపట్టరాదంటూ ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ బుధవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. వైయస్ జగన్ ఆస్తులపై ప్రాథమిక విచారణ జరిపి రెండు వారాల్లోగా తమకు సీల్డ్ కవర్‌లో నివేదిక సమర్పించాలని రాష్ట్ర హైకోర్టు ఇటీవల సిబిఐని ఆదేశించిన విషయం తెలిసిందే.

English summary
YSR Congress party spokes person Ambati Rambabu condemned that YS Jagan special leave petition issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X